గూడూరు రూరల్ పరిధిలోని చవట పాలెం వద్ద మరో దిశ ఘటన…

317

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని చవట పాలెం వద్ద మరో దిశ ఘటన వెలుగు చూసింది.. చవటపాలెం ప్రాంతానికి చెందిన పర్వీన్ 23 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.చవటపాలెం వద్ద గల గ్రామ సచివాలయం సమీపంలోని పాడు బడ్డ భవనంలో పర్వీన్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు… అయితే మృతదేహం పై నూలు పోగు కూడా లేకపోవడం.. తల పై రాడ్డు తో కొట్టిన గాయాలు ఉండటంతో పర్వీన్ పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో దోస పిండి కోసం బైటికి వచిన పర్వీన్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి మొత్తం వెతికినా ప్రయోజనం లేకపోయింది.అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కాలనీ వాసులు గుర్తించినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.