ధావన్‌ మెరుపులు..!

106

The bullet news (Sports)- అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఏకైక​ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 15 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(51 బ్యాటింగ్‌), మురళీ విజయ్‌( 18 బ్యాటింగ్‌) కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌న్‌ ముందుకు తీసుకెళుతున్నారు.

ఈ చారిత్రక టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను విజయ్‌, ధావన్‌లు ఆరంభించారు. ఒకవైపు విజయ్‌ ఆచితూచి ఆడితే ధావన్‌ మాత్రం బౌండరీలతో మెరుపలు మెరిపించాడు. అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో ధావన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఇది ధావన్‌కు ఆరో టెస్టు ఫిఫ్టీ.

SHARE