పళ్లు రాలిపోతాయన్నారు.. సారీ చెప్పారు.. ప్రభుత్వాసుపత్రిలో సర్దుమణిగిన వివాదం

231

The bullet news (Nellore)-  నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వివాదాలకు వేదికమారుతోంది.. విధుల్లో అలసత్వంతో పేషంట్లకు చుక్కులు చూపించే డాక్టర్లు ఇవాళ అభివ్రుద్ది కమిటి మెంబర్ మెగరాల సురేష్ కు సినిమా చూపించారు.. సెమినార్ హాల్ ప్రారంభోత్సవంలో జరిగిన మాటల యుద్దం అసభ్యపదజాలం వాడేదాక వచ్చింది.. శానిటేషన్ సరిగ్గా లేదంటూ మొగరాల
సురేష్ సూపరిడెంటెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో సూపరిడెంటెంట్ రాధా కిష్ణంరాజు కూడా ఘటుగా స్పందించడంతో
కోపోద్రిక్తులైన సురేష్ సూపరిడెంటెంట్ ను పళ్లు రాలగొడతానంటూ పైరయ్యారు.. దీంతో సురేష్ క్షమాపణ చెప్పాలంటూ
సిబ్బంది డిమాండ్ చేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల సర్దుబాటు చేసేందుకు యత్నించినా ఎవరూ వెనక్కు తగ్గలేదు.
చివరికి మొగరాల సురేష్ తన మాటలు వెనక్కు తీసుకుంటున్నానంటూ, క్షమాపణ తెలిపారు. దీంతో వివాదం
సద్దుమణిగింది. దీనిపై సురేష్ స్పందిస్తూ శానిటేషన్ సరిగా లేదనందునే సూపరిడెంటెంట్ కావాలనే ఇష్యూ చేశారన్నారు..
కోట్లకు కోట్లు శానిటేషన్ పేరుతో అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు.. అవినీతిని ప్రశ్నిస్తే అధికారులందరూ
సిండికేట్ అయ్యి ధర్నాలు, ఆందోళన చేయడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు..

SHARE