వాళ్ళ అవినీతి, అసమర్థత వల్లే డిఎం ఆత్మహత్యాయత్నం..- ఎమ్మెల్యే కాకణి ఆరోపణలు

55

THE BULLET NEWS (NELLORE)-వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.. రైతుల శ్రేయస్సు కోసము పరితపించే సివిల్ సప్లయ్ డిఎం కిష్ణయ్య ఆత్మహత్యాయత్నానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణమని ఆయన ఆరోపించారు.. నెల్లూరులోని కిమ్స్ చికిత్స పొందుతున్న డిఎం కిష్ణారెడ్డిని పరామర్శించిన ఆయన కలెక్టర్ అసమర్దత, మంత్రి సోమిరెడ్డి అవినీతి వల్లే నిజాయితీ అధికారి కిష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారని ఆరోపించారు.. మిల్లర్ల వద్ద నుంచి మంత్రి ముడుపులు తీసుకోవడం, అసమర్ద కలెక్టర్ వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అధికారులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి అవినీతికి పాల్పడుతున్న మంత్రి సోమిరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. కలెక్టర్ అధికాపార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

సిగ్గుమాలిన వ్యక్తి..

SHARE