తమిళ నాట ముగిసిన కరుణ శకం

86

THE BULLET NEWS (CHENNAI):- కరుణానిధి.. ఈ పేరు గుర్తుకురాగేనే నల్ల కళ్లద్దాలు, పసుపు రంగా శాలువా గుర్తొస్తాయి. తమిళ రాజకీయాలను ఐదు దశాబ్దాలకుపైగా శాసించిన కళైజ్ఞర్‌.. ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకీ నల్ల కళ్లద్దాల వెనక ఉన్న రహస్యమేంటో.. డీఎంకే సీనియర్ నేత ఇలంగోవన్ గతంలో ఓ సందర్భంలో వివరించారు. 1960లలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి ఎడమ కంటికి గాయమైందని, వైద్యుల సూచనల మేరకు అప్పటి నుంచి నల్ల కళ్లద్దాలను ధరిస్తున్నారని చెప్పారు. దాదాపు 46 ఏళ్లపాటు ఇటువంటి కళ్లద్దాలనే ధరించిన కరుణ.. గతేడాది నుంచి వైట్‌ గాగుల్స్‌ ధరిస్తున్నారు.  ఇక.. పసుపు రంగు శాలువా వేసుకుంటే… ఎంత మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇట్టే గుర్తుపట్టవచ్చని, అందుకే కరుణ ధరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దాదాపు ఏడాది క్రితమే కరుణ నల్ల కళ్లద్దాలను పక్కన పెట్టేసినా.. పసుపు శాలువాను మాత్రం చివరి వరకు వదల్లేదు.

SHARE