‘ఆ రోజులు’ గురించి సిగ్గు వద్దు… యువతి పోస్టు వైరల్…

114

The bullet news (Health)_ ఆస్ట్రేలియాకు చెందిన స్పిరిట్ హీలర్, ఫేమస్ హెయిర్ డ్రెస్సర్ తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. 26 ఏళ్ల యాజ్మీన్‌జెద్… పీరియడ్స్ విషయంలో తలెత్తే బిడియాన్ని దూరం చేసేందుకు అనూహ్యమైన ముందడుగు వేసింది. ఆమె పీరియడ్స్‌లో వచ్చే బ్లడ్‌ను తన ముఖంపై రాసుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఈ పోస్టు చూసిన చాలామంది నెటిజన్లు ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నదని కామెంట్ చేశారు. దీనిపై యాజ్మీన్ తన స్పందన తెలియజేస్తూ ‘ఈ పనిని నేను నా బాడీని రికనెక్ట్ చేసుకునేందుకే చేశాను. పీరియడ్స్ విషయంలో సామాజిక దృష్టి కోణంలో మార్పు రావాలి. మహిళలు దీనిని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అందుకే నా బ్లడ్‌ను నా ముఖం మీద రాసుకుని… ఇదేమీ సిగ్గుపడాల్సిన అంశం కాదని చెప్పాలనుకున్నానని’ వివరించింది. కాగా ఆమె మానసిక వైద్యునికి చూపించుకోవాల్సిన అవసరముందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

SHARE