న్యాయం చేస్తారా.. చావమంటారా..? వింజ‌మూరులో చీటీల బాధితుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

87

The bullet news (Vinjamuru)_ పిల్ల‌ల చ‌దువు కోసం పైసా పైసా పోగేసిన డ‌బ్బు కొంద‌రిది.. అమ్మాయి పెళ్లి కోసం కూడ‌పెట్టిన డ‌బ్బు మ‌రొక‌రిది. ఇలా కోట్ల రూపాయ‌ల మేర ఎగ్గొట్టి ప‌రారైన చీటీల వ్యాపారి సుధాక‌ర్ కు వ్య‌తిరేకంగా వింజమూరులో బాధితులు ఆందోళ‌న నిర్వ‌హించారు.. పురుగుల మందు తాగుతూ ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి ప్ర‌య‌త్నించారు..  దాదాపు 57 కుటుంబాలు వ్యాపారి కొండా సుధాకర్ పెట్రోల్ బంకు ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.. చీటీలతో పేరుతో సుధాకర్  5 కోట్ల మేరకు బాధితులకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు.. దీంతో బాధితులు అప్పట్లో జిల్లా ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణ తోపాటు హోం మంత్రి చిన్నరాజప్పకు సైతం పిర్యాదు చేశారు.. కానీ ఫలితం లేకపోవడంతో ఇవాళ వింజమూరులోని  సుధాకర్ పెట్రోల్ బంకు వద్ద పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. ఈ సమయంలో పోలీసులు, బాధితుల మధ్య స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది..

పిల్లల చదువు కోసం, వారి పెళ్లిల కోసం లక్షల రూపాయాలు చీటీలు కట్టామని ఇంతలోనే సుధాకర్  డబ్బులు తీసుకుని పరారయ్యాడని బాధితులు వాపోతున్నారు.. ఒక్కొక్కరికి లక్ష నుంచి 15 లక్షల దాకా టోకరా పెట్టారని వాళ్లు వాపోయారు..
SHARE