అవినీతి గురించి కలెక్టర్‌ కు తెలిసి కూడా స్పందించడంలేదు

109

The bullet news (Nellore)- జిల్లాలో భారీ అక్రమాలు, ఫోర్జరీలు జరుగుతుంటే జిల్లా కలెక్టర్‌ చోద్యం చూస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే , జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేంలో కాకాణి మాట్లాడారు. జిల్లా పాలనా ధికారిగా ఉన్న వ్యక్తి  జరుగుతున్న అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోపిడీ చేస్తుంటే.. వాటికి సంబంధించి ఆధారాలు సహా అందించినా స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి సోమిరెడ్డి అండదండలతో అవినీతి కార్యకలాపాలకు అంతులేకుండా పోయిందని కాకాణి ఆరోపించారు. సాగునీటి పనులకు సంబంధించి ఒక మహిళా డీఈని మంత్రి వివిధ రాకాలుగా దూషించారన్నారు. ఇలా అధికారులను బెదిరించడం మానుకోవాలని…జిల్లాలో అవినీతిపై పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు.  ఈ సమావేంలో జడ్పీటీసీ వెంకట శేషయ్య పాల్గొన్నారు.

SHARE