కేంద్రంతో పోరాడే దమ్ము వైసీపీకి లేదు – మంత్రి సోమిరెడ్డి

182

The bullet news ( Naidupeta)_ కేంద్రంతో పోరాడే దమ్ము వైసీపీకి లేదని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. నాయుడుపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పై విరుచుకుపడ్డారు.. ఢిల్లీలో సాష్టాంగనమస్కారాలు..ఇక్కడేమో వీరతాళ్ళు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.. ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్షం అధికార దాహంతో ఉందని మండిపడ్డారు.. రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ లేదని ఆ పాత్ర కూడా మేమె పోషిస్తున్నామన్నారు.. జగన్ కి విషయ పరిజ్ఞానం లేదని, దానికోసం ఆయన ఒక మంచి ట్యూటర్ని నియమించుకుంటే బాగుంటుందని సూచించారు..

SHARE