కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం…

68

THE BULLET NEWS (AMARAVATHI)-కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు శాసనసభలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. స్పెషల్‌ స్టేటస్‌లో ఇచ్చేవన్నీ ఏపీకి ఇస్తే తప్ప ఆందోళన ఆగదని ఆయన అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో స్పష్టం చేశారు.

విభజన చట్టంలోని హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పెషల్‌ స్టేటస్‌లో ఇచ్చేవన్ని ఏపీకి ఇస్తే తప్ప ఆందోళన ఆగదని ఆయన అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని అన్నారు.

సెంటిమెంటుతో డబ్బులు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి.. సెంటిమెంటుతోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తులేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే బీజేపీ నేతలు కొత్తగా చెబుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోవాని కేంద్రాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని బీజేపీ నేతలు అంటున్నారు. మరి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నామన్నారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది కూడా పెద్దగా ఏం లేదని చంద్రబాబు అన్నారు. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు తుడిచిపెట్టేశారని.. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటూ పరోక్షంగా బీజేపీకి సూచించారు.

రాష్ట్రానికి రావల్సిన హక్కుల విషయంలో రాజీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి హోదా ఇవ్వడంతోపాటు రెవిన్యూలోటును భర్తీ చేయాలని..  పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌, అమరావతి నిర్మాణం, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం, కేంద్ర విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

విభజన చట్టంలోని హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మాణాన్ని సభ్యులందరూ ఆమోదించారు. సభలో ఉన్న ముగ్గురు బీజేపీ సభ్యులు తీర్మాణానికి వ్యతిరేకంగా గానీ.. అనుకూలంగాగానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.

SHARE