తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం…

217

THE BULLET NEWS (TIRUPATI)-పాలు తోడుకొనేందుకు కొత్త సాచెట్ మార్కెట్ లోకి రానుంది. అదే.. పాలు తోడుకోవాలంటే.. తోడుకోసం పెరుగు వేయడం ఇప్పటివరకు ఉంది. కానీ.. ఇప్పుడు పెరుగు అవసరం లేకుండానే.. సాచెట్ ద్వారా పాలను పెరుగు చేసేందుకు కొత్త ప్రయాగాన్ని విజయవంతంగా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో రెడీమేడ్‌ తోడు మార్కెట్‌లోకి అతి త్వరలోనే రానుంది. ఇక చేమిరి సాచెట్‌ తీసుకొచ్చి తోడు వేస్తే చాలు. రెండు మూడు గంటల్లో పెరుగు సిద్ధమౌతుంది. సహజంగా.. పాలు పెరుగుగా మారటానికి ల్యాక్టో కోకస్‌ బ్యాక్టీరియా అత్యంత కీలకం. దానిపై వీరు చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఆర్‌కెవీవై ప్రాజెక్టు కింద డాక్టర్‌ నాగేశ్వరరావు నేతృత్వంలో సాగుతోన్న ఈ పరిశోధన తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. ఇందుకోసం పలు ప్రాంతాల నుంచి పాల శాంపిల్స్‌ను సేకరించి మరీ పరిశోధించారు. వాటిపై ల్యాక్టో కోకస్‌ బ్యాక్టీరియాతో మూడుదశల్లో ప్రయోగాలు చేసి రెడీ టు యూజ్‌ తోడును ఆవిష్కరించారు. ల్యాక్టో కోకస్‌ బ్యాక్టీరియాను పాల నుంచి సేకరిస్తారు. ప్రతి పదార్థానికి సెల్ఫ్‌లైఫ్‌ ఉన్నట్లే తోడుకు కూడా పాడయ్యే తేదీని కూడా నిర్ధారిస్తారు. కొద్ది రోజుల్లోనే… మార్కెట్‌లో చేమిరి సాచెట్లు… అందుబాటులోకి రానున్నాయి.

SHARE