అభిమాని ఇచ్చిన టీ తాగుతూ, బన్ తింటూ..

70

The bullet news (Ananthapuram)-ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం ప్రజలతో రెండోరోజు మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. అన్నొస్తున్నాడంటూ జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నేతను కలిసి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పాదయాత్రలో భాగస్వాములు అవుతున్నారు. 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ గుత్తి అనంతపురం ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుత్తి శివార్లలో ఓ అభిమాని వైఎస్ జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా జననేత అప్యాయంగా వాటిని స్వీకరించారు. అభిమానికి ఇచ్చిన టీ తాగుతూ బన్ తింటూ అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత గుత్తి సమీపంలో ఉల్లి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్, అనంతరం వేరుశనక రైతులతో పంటలు, దిగుబడి, గిట్టుబాటు ధరల గురించి చర్చించారు. ఉల్లి పంటకు నిలకడగా ధరలు లేవని వైఎస్ జగన్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి పెద్ద చెరువును అభివృద్ధి చేసి ఆయకట్టును స్థిరీకరించాలని కోరగా.. అధికారంలోకి రాగానే మీ సమస్యలను తీరుస్తానంటూ వారికి వైఎస్ జగన్ భరోసా కల్పించారు.

SHARE