నెల్లూరు కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఏఐ ఆందోళన

39

The bullet news ( Nellore ) – డిఎస్సీ అభ్యర్దులు డివైఎప్ఐ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు.. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.. ఈ సందర్బంగా డివైఎప్ఐ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ఉడతా మాట్లాడుతూ నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిఎస్పీకి టెట్ నిర్వహిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కల్గిస్తోందన్నారు.. టెట్ నిర్వహణకు నెల రోజులు గడువు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. దానికి తోడు టెట్ ను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని చెప్పడంతో నిరుద్యోగులు ఆందోళనలలో ఉన్నారన్నారు.. టెట్ నిర్వహణకు గడువు పెంచుతూ ఆఫ్ లైన్ లో టెట్ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. టెట్ మీద సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే డివైఎప్ఐ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.. దాంతో పాటు డిఎస్పీలో పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.. జిల్లాలో ఉపాద్యాయ పోస్టులు చాలా వరకు ఖాళీ ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఖాళీలు ఉన్నాయని చూపడం దుర్మార్గమన్నారు.. ఈ కార్యక్రమంలో డిఎస్సీ అభ్యర్దులు భారీగా పాల్గొన్నారు..

SHARE