కోడిగుడ్డు ధర దిగి వస్తోంది…

103

The bullet news (Health)_  డిమాండు, సప్లయిల మధ్య అంతరంతో ఆకాశన్నంటిన కోడిగుడ్ల ధరలు దిగి వస్తున్నాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) వెల్లడించింది. గత వారం కోడిగుడ్ల కొరతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు పెరిగాయి. ఒక్కో కోడిగుడ్డు ధర ఆరు, ఏడు రూపాయల దాకా విక్రయించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రోజుకు రెండున్నర కోట్ల కోడిగుడ్లు అవసరం కాగా వీటి కొరతను తీర్చేందుకు కోటి గుడ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దీంతో కోడిగుడ్లు డజను ధర 60 రూపాయలకు దిగి వచ్చింది. కోడిగుడ్ల ధరను స్థిరంగా ఉంచేందుకు పశ్చిమబెంగాల్ పౌల్ట్రీ ఫెడరేషన్ సహకారంతో రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు గుడ్లను విక్రయిస్తున్నామని నెక్ అధికార ప్రతినిధి చెప్పారు. కోడిగుడ్ల ధరలు పెరగకుండా నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు నెక్ ప్రతినిధులు వివరించారు.

SHARE