ఆద‌ర‌ణ‌ను చూసి ఆసూయ‌ప‌డుతున్నారు – ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్

80

THE BULLET NEWS (VUYYURU)-ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మానికి వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌నను చూసి వైసీపీ నేత‌లు ఈర్ష్య‌ప‌డుతున్నార‌ని ఎమ్మెల్సీ, ఏపీ పంచాయితీరాజ్ చాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు..పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడె.ప్రసాద్ తో క‌లిసి ఉయ్యురు మండలం చినఓగిరాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు.. ప్రభుత్వం చేపట్టిన పధకాల గురించి వివరించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలుగుదేశం ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఒక్క‌రూ సంతృప్తిగా ఉన్నార‌న్నారు..వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం చంద్ర‌బాబు నాయుడి పాల‌న బేషంటున్నార‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మండల అధ్యక్షుడు భీమవరపు.పిచ్చిరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ దాసు.శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఓగిరాల. నాగభూషణం, జ‌డ్పీటీసీ మోహ‌న్ రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు..

SHARE