విద్యాహక్కు చట్టాన్ని అమలు చెయ్యండి – ఎబివిపి గుడూరు డివిజన్ కార్యదర్శి మనోజ్…

87

The Bullet News ( Gudur)- విద్యాహక్కు చట్టాన్ని అమలు చెయ్యాలని, శెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని ఎబివిపి గుడూరు డివిజన్ కార్యదర్శి మనోజ్ ఇవాళ డిప్యూటీ డీఈఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా గుడూరు డివిజన్ లోని పలు ప్రయివేట్ స్కూల్స్ ఆగడాలని అరికట్టాలని కోరారు.. చాలా పాఠశాలల్లో ఆటలాడేందుకు గ్రౌండ్స్ లేవని, అందువల్లే మానసిక ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారన్నారు.. అలాగే కార్పొరేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్స్ సరైన అర్హత లేకుండా భోదిస్తున్నారని అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మనోజ్ కోరారు.. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు రవి, చిన్న, కోటయ్య, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు..

SHARE