ఆనంతోనే ఆత్మకూరు అభివృద్ది – మంత్రి నారాయ‌ణ ప్ర‌శంస‌లు..

135

The bullet news (Atmakur)_  మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డితోనే ఆత్మ‌కూరు అభివృద్ది సాద్య‌మ‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు. ఇవాళ ఆత్మ‌కూరులో నిర్మిస్తున్న హౌస్ ఫ‌ర్ ఆల్ ఇళ్ల నిర్మాణాల‌ను మంత్రి ప‌రిశీలించారు.. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం ఆనం ప‌రిత‌పిస్తుంటార‌న్నారు.. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే ప‌ట్ట‌ణ ప‌రిధిలో 1966 పేద మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 123 కోట్ల నిధులతో జి ప్ల‌స్ 3 అపార్టుమెంట్లను షీర్వల్ అధునాతన టెక్నాలజీ తో నిర్మిస్తున్నామ‌న్నారు. ఆ గృహాలకు అవసరమైన రోడ్లు, డ్రైన్లు మరియు ఇతర మౌళిక వసతులకోసం మరో రూ. 29 కోట్లతో వెచ్చించనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.. వ్యక్తిగతంగా తమ స్వంత స్థలాలలో పక్క గృహాలు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబరిచిన మరో 1471 కుటుంబాలకు రూ. 51.50 కోట్ల నిధులతో అర్బన్ హౌసింగ్ పథకం ద్వారా స్వంత ఇల్లు నిర్మించుకొనుటకు మంజూరు చేశామని తెలిపారు. అనంత‌రం ఆనం మాట్లాడుతూ ఎన్టీయార్ గృహాలు అత్యాధునిక టెక్నాల‌జితో నిర్మిస్తున్నామ‌న్నారు..అభివృద్దికి స‌హ‌క‌రిస్తున్న మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు..

SHARE