ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి ఎన్టీయార్ ప‌క్కా ఇళ్లు, పెన్ష‌న్, జీవ‌నోపాధి క‌ల్పిస్తాం – మాజీ మంత్రి ఆనం

91

The bullet news (Nellore)_  ద‌ళితుల అభ్యున్నతే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి అన్నారు.. నెల్లూరులో త‌న నివాసంలో నిర్వ‌హించిన చంద్రన్న ముందడుగు – దళిత తేజం పై ఆత్మకూరు నియోజకవర్గ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దళితవాడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌న్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో గత రెండేళ్లలో 37 గ్రామీణ దళిత కాలనీలకు 10 కోట్ల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. ప్రస్తుతం ఇంకో 35 గ్రామ పంచాయతీల దళిత కాలనీల‌లో మరో రూ. 9.93 కోట్ల తో రహదారులకు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు మంజూర‌య్యాయ‌న్నారు.. అన్ని ద‌ళిత‌కాల‌నీలు అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆనం తెలిపారు.. అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ఎన్టీయార్ పక్కా గృహం , పెన్షన్లు, జీవనోపాధికి రుణాల మంజూరు చేసి ఆదుకుంటామ‌న్నారు..

SHARE