మహిళలు ఆర్దికంగా ఎదగాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యం- మేయర్ అబ్దుల్ అజీజ్

144

The bullet news (Nellore)-  మహిళలు ఆర్దికంగా ఎదగాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యం.. అందులో భాగంగానే వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు అర్దికంగా అండగా ఉంటామని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. ఇవాళ 42వ డివిజను మున్సిపల్ ఓల్డ్ క్వార్టర్సు ప్రాంతంలో మేయరు  పర్యటించి స్థానికంగా ఉన్న బీడీ తయారీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ, చుట్ట కార్మికులు రోజుకు దాదాపు పదిగంటల పాటు శ్రమిస్తూ కేవలం యాభై రూపాయలను సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు, కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అధ్బుతమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నగరంలోని ప్రతీ డివిజనులో ఒక మహిళా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ విభాగాల్లో మహిళలకు శిక్షణ అందిస్తామని మేయరు వివరించారు. బేకరీ, బిస్కట్, అప్పడాల తయారీ, బ్యూటీ పార్లర్ నిర్వహణ, ఊరగాయల తయారీ వంటి విభాగాల్లో శిక్షణ ఇప్పించి ఆయా ఉత్పత్తులకు ప్రభుత్వం నుంచి ఐఎస్ఐ ధృవీకరణ, మార్కెటింగ్ తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తామని మేయరు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, నాయకులు జాకీర్, జాఫర్ మొహిద్దీన్, హయాత్, సిద్దిక్, సాబీర్ ఖాన్, పాషా మొహిద్దీన్, ఖాదర్ బాషా, షంషుద్దీన్, సుభహాన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE