త్యాగ‌ధ‌నుల త్యాగాల‌ను అంద‌రూ తెలుసుకోవాలి – ఎన్ ఎం ఓ జాతీయ సంఘటనా కార్యదర్శి అర్శనార్మ

85

The bullet news (Gudur)-  భావిభార‌త పౌరుల‌కు మహానీయుల త్యాగాలు, పూర్వీకుల గొప్ప‌ద‌నాన్ని వివ‌రించేందుకు నేష‌న‌ల్ మెడిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (ఎన్ ఎం ఓ) ఆధ్వ‌ర్యంలో ధ‌న్వంత‌రి గ్రంధాల‌యాన్ని ప్రారంభిస్తున్నామ‌ని ఎన్ ఎం ఓ జాతీయ సంఘటనా కార్యదర్శి అర్చన శర్మ పేర్కొన్నారు. గూడూరులోని బీసీ బాలుర హాస్ట‌ల్ లో ఆమె గ్రంధాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ఏబీవీపీకి అనుబంధ విభాగమైన ఎన్ ఎం ఓ దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వారి గొప్ప‌ద‌నం అంద‌రికీ తెలియాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ కార్య‌క్ర‌మాన్ని చేపట్టామ‌న్నారు. హెల్త్ క్యాంపులు కూడా చేప‌డ‌తామ‌న్నారు.. దాదాపు 300 పుస్త‌కాలు క‌ల్గి ఉన్న ఈ లైబ్ర‌రీని అంద‌రూ ఉప‌యోగించుకోవాల‌న్నారు.. మూడు నెల‌ల అనంత‌రం ఈ పుస్త‌కాల మీద వకృత్వ పోటీలు, వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వహిస్తామ‌న్నారు.. ఆర్ ఎస్ ఎస్ విభాగ నిర్వాహ‌ణాధికారి విశ్వేశ్వ‌ర‌రావు, ఏబీవీపి రాష్ట కార్య‌ద‌ర్శి మ‌ల్లికార్జున్, విభాగ సంఘ‌ట‌నా కార్య‌ద‌ర్శి జ‌గ‌దీష్‌, డివిజ‌న్ కార్య‌ద‌ర్శి మ‌నోజ్, దొర‌బాబు, చిన్న పాల్గొన్నారు..

SHARE