ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి – విఎస్ యు వైస్ చాన్స‌ల‌ర్ వీర‌య్య‌

88

The bullet news (Nellore)- నెల్లూరు రోట‌రీ క్ల‌బ్- పినాకిని యూత్ క్ల‌బ్ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్శిటీ వైస్ చాన్స‌ల‌ర్ వీర‌య్య కొనియాడారు.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ కొత్త పంధాలో అంద‌రి మన్న‌లు పొందుతోంద‌న్నారు.. జిల్లాస్థాయిలో ప‌ర్యావ‌ర‌ణం – ప‌రిర‌క్ష‌ణ అంశంపై ఏర్పాటు చేసిన పోటీల్లో చెముడుగుంట‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్దులు విజేత‌లుగా నిలిచారు.. జిల్లా స్థాయిలో నిర్వ‌హించిన ఈ పోటీల్లో 125 మంది పాల్గొన‌గా వారిలో 10 మందిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు.. ఈ అవార్డుల ప్ర‌ధానోత్స‌వానికి పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ విద్యార్దులు స‌మాజ స్పృహ క‌ల్గి ఉండాల‌న్నారు.. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేదుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే నాణ్య‌మైన‌ విద్య అందుతుంద‌నన్నారు.. పోటీల్లో విజేత‌లుగా నిలిచిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న అప‌ర్ణ, ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ కావ్య‌కామాక్షిల‌కు ఆయ‌న మెమోంటో, ప్ర‌శంసా ప‌త్రం అంద‌జేశారు.. ఈ విద్యార్దుల‌కు గైడ్ గా వ్య‌వ‌హ‌రించిన ఉపాధ్యాయుడు సూర్య నారాయ‌ణ‌ను ప్ర‌శంసించారు.. ఈ కార్య‌క్ర‌మంలో హెచ్ ఎం ర‌మేష్ కుమార్, ఉపాధ్యాయులు, పినాకిని యూత్ క్ల‌బ్ మెంబర్స్ ఉన్నారు..

 

SHARE