మ‌నుబోలులో హాస్ట‌ల్ విద్యార్దుల‌కు ప‌రీక్షా సామాగ్రీ పంపిణీ

142

The bullet news (Manubolu)- మ‌నుబోలులోని ఎస్సీ బాలుర‌, బాలిక‌ల హాస్ట‌ల్లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ విద్యార్దుల‌కు మండ‌ల టీడీపీ ఉపాధ్య‌క్షులు ఉన్నం ల‌క్ష్మీ నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ఇవాళ ప‌రీక్షా సామాగ్రి పంపిణీ చేశారు.. ఈ సంద‌ర్బంగా టీడీపీ నాయ‌కులు దొడ్ల శ్రీనివాసుల‌రెడ్డి మాట్లాడుతూ త‌న స్వంత నిధుల‌తో ల‌క్ష్మీ నారాయ‌ణ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.. విద్యార్దుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రెన్నో చేయ‌ల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.. దాంతో పాటు ప‌దోత‌ర‌గ‌తిలో మండ‌ల ప్ర‌ధ‌మ‌, ద్వితీయ స్థానాల్లో వ‌చ్చిన‌వారికి రూ.5000, రూ.3000 అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు అల్లారెడ్డి ర‌వీంద్రారెడ్డి , శ్రీనివాసుల‌రెడ్డి, రామిరెడ్డి, ర‌ఘురామ‌య్య‌, అనుమాయ‌మ్మ‌, వార్డెన్ ప‌ద్మ‌నాభ‌రెడ్డి, మ‌నుబోలు పేవాసంఘం అద్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు సురేష్ బాబు, జ‌గ‌దీష్ లు పాల్గొన్నారు..

SHARE