ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అభాగ్యుల ఇంటవెలుగులు – మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

96

The bullet news (Nellore)- పేదల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఇవాళ ఆయన లబ్దిదారులకు అందజేశారు. అనంతసాగరం మండలం వరికుంటపాడుకు చెందిన గున్న యానాది రెడ్డికి రూ. 94 ,220 మరియు గున్న రమణమ్మకి రూ. 2 ,23 ,294 చెక్కులను అందజేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.. సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.. ఆత్మకూరు నియోజకవర్గంలో మరింత మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఆనం హామీ ఇచ్చారు..

SHARE