త్వరలో 50 లక్షల మందికి రైతు భరోసా–రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

180

త్వరలో 50 లక్షల మందికి రైతు భరోసా

రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు త్వరలో రైతు భరోసా అందించనున్నట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు .చేజర్ల మండలంలో సోమవారం ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. తొలుత ఆయన మండలంలోని వావి లేరు గ్రామంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కోటితీర్థం గ్రామంలో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శాల్లో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కింద 35 లక్షల మందిని గుర్తించామని, సాంకేతిక కారణాల వల్ల కొంత మంది రైతుల పేర్లు నమోదు కాకపోవడంతో అర్హులైన రైతులకు నష్టపోకూడదనే ఉద్దేశంతో మ్యాన్యువల్ పద్ధతిలో రైతులను గుర్తించామన్నారు. గతంలో ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని ,అయితే నేడు ప్రభుత్వ అధికారులు ప్రజల వద్దకే వస్తారని చెప్పారు .ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ చేపట్టిన గ్రామ సచివాలయాల ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. డ్రైనేజీ, సాగునీటి సౌకర్యాల కోసం 45 వేల కోట్ల రూపాయల వ్యయంతో పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఆయకట్టు చివరివరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆత్మకూరులో శుక్రవారం వర్క్ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వం లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. అర్హతే ప్రామాణికంగా, పార్టీలు వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు.ఎంజీఆర్ హెల్ప్ లైన్ కింద ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో మాట్లాడ వచ్చని తెలిపారు. దీనికోసం ఆయన ఫోన్ నెంబర్ ను ప్రజలందరికీ తెలిపారు . 08627-221999 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం ఆయన కోటితీర్థం గ్రామంలోని కామాక్షి సమేత కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తూమాటి విజయభాస్కర్రెడ్డి, షేక్ సిరాజుద్దీన్ , బి.వీర రాఘవ రెడ్డి, పీర్ల పార్థసారథి, బాలి రెడ్డి సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.