మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య…

140

తమ పొలం తీసుకొని తమకు ఉద్యోగం ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ తొలగించాలంటూ మనస్థాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముత్తుకూరులోని ఏపీ జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకుంది. స్ధానికులు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తుకూరు మండలం నెల్లటూరు హరివాడకు చెందిన వెంకటరమణయ్య తన పొలమంతా ఏపీ జెన్కోకి అప్పట్లో ఇచ్చామని అయితే ఉద్యోగం ఇచ్చి కొన్ని రోజులకే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్నుంచి ఉద్యోగం దొరక్క చేసుకోడానికి పొలం లేక తీవ్ర మనస్థాపానికి గురైనాడు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ బాధను వ్యక్తం చేశాడు.తమ ముగ్గురు బిడ్డలను భార్యను పోషించుకునే స్థోమత లేక ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాడు.చివరి అవకాశంగా ఏపీ జెన్ కో కి వెళ్లి మరోసారి ఉద్యోగం ఇవ్వమని కోరాడు. అయితే యాజమాన్యం నిరాకరించడంతో బాయిలర్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికైన జెన్ కో యాజమాన్యం ఆ కుటుంబాన్ని ఆదుకొని తన భార్యకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్ధులు కోరుచున్నారు.