పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

88

THE BULLET NEWS (SHAMSHABHAD)-గోల్డ్‌స్టోన్‌ ఆక్రమిత భూమిలో ఇవాళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సిమియగుడలో గోల్డ్‌ స్టోన్‌ ఆక్రమిత భూమిలో ఇవాళ ఉదయం రైతులు విత్తనాలు చల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులపై దాడి చేసి అరెస్టు చేశారు. వీరిని శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. స్టేషన్‌ను ముట్టడించి రైతులను విడుదల చేయాలని ధర్నా చేశారు.

SHARE