మాజీ మంత్రి మాదాల జానకి రామ్ అస్తమయం..

123

The bullet news (UdayaGiri)_ ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ పొలిటిషియన్ మాదాల జానకి రామ్ కన్నుమూశారు. గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆయన ఇవాళ నెల్లూరులోని కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షిణించిడంతో  హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే  తుదిశ్వాస విడిచారు.. జానకి రామ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. వారికి వివాహాలయ్యాయి..

  ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నర్రవాడ జానకి రామ్ స్వగ్రామం..  ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో గనుల శాఖామంత్రిగా పనిచేశారు..  సీనియర్ పొలిటిషియన్ గా మెట్టప్రాంత ప్రతినిధిగా ఆయన ఉదయగిరిన సస్యశ్యామలం చేయాలంటూ సాగర్ కుడి కాలువ పొడిగింపు కోసం 2008లో సాగర్ నుంచి ఉదయగిరి వరకు పాదయాత్ర చేశారు.. సీతారామ్ సాగర్, ఉదయగి పర్యాటక అభివ్రుద్ది కోసం అనేక అనేక ప్రయత్నాలు చేశారు.. మర్రిగుట్ల, సీతారామ్ సాగర్ జలాశయాలు నిర్మాణాల కోసం కేంద్ర రాష్టప్రభుత్వాల ద్రుష్టికి పలుమార్లు అక్కడి నుంచి ప్రత్యేక బ్రుందాల ద్వారా హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందజేశారు.. కాంగ్రెసె పార్టీలో దేశస్థాయి నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన హయాంలోనే తనఎన్నికల ప్రచారం కోసం ఇందిరాగాందీని  ఉదయగిరికి తీసుకొచ్చారు..
SHARE