కొడుకుతో పాటు తండ్రికీ..

76

The bullet news(driving)- ప్రమాదాల్ని నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కొత్త నిబంధనలు పెట్టినా రూల్స్‌ని అతిక్రమించి ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. పిల్లల పట్ల బాధ్యత వహించాల్సిన తల్లిదండ్రులు కూడా బండి ఇచ్చి వదిలేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా తల్లి దండ్రుల మాట పెడచెవిన పెడుతున్నారు యువకులు. ఇద్దరు ముగ్గురు స్నేహితుల్ని ఎక్కించుకుని అపరిమితమైన వేగంతో బండిని పోనిస్తున్నారు. ఒక్కోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల, స్పీడ్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు కూడా తగులుతున్నాయి. ప్రమాదాలు కొని తెచ్చుకునే వారిలో మైనర్లు ఎక్కువగా ఉండడం ఆందోళనకు దారితీస్తుంది.

వీటిని నివారించే దిశగా మరో సరికొత్త ప్రక్రియను చేపట్టింది నగర ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం. కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు లేదని భావించి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ ఆరంభించిన రెండు నెలల్లోనే సుమారు 69 మంది తండ్రులు కటకటాల పాలయ్యారు. రాబోయే రోజుల్లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ప్రమాదాల నియంత్రణ, యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే శిక్షలు కఠినతరం చేయనున్నామని నగర ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ చెబుతున్నారు.
SHARE