ఫేడోరో ప్రమాదం పై విచారణ…

186

THE BULLET NEWS (KOVUR)-కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్న పరిశ్రమలు మ్రుత్యు కుహరాలుగా మారుతున్నాయి..నిబంధలకు విరుద్దంగా నడుపుతూ కార్మికుల ప్రాణాలను తీస్తున్నాయి.. నెల్లూరుజిల్లా కోవూరు జాతీయరహదారి సమీపంలో ఉన్న ఫెడోరో రోయ్యలమేత తయారీ కేంద్రంలో నిన్న జరిగిన ప్రమాదంలో పంజాబ్ కు చెందిన సోనూ అనే వ్యక్తి మ్రుతిచెందాడు.. లిప్ట్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.. దీనిపై ఇండస్ట్రీరియల్ సేప్టే ఇన్ స్పెక్టర్ శివశంకర్ రెడ్డి విచారణ చేపట్టారు. స్థానిక ఎస్ఐ తో కలిసి ఇవాళ ఫెడోరా కంపెనీలో తనిఖీలు నిర్వహించారు.. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.. కనీస విద్యార్హతలు సైతం లేకుండా పరిశ్రమలో టెక్నికల్ వర్క్స్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం విచారణ జరపుతున్నామని ఆయన తెలిపారు.. లిప్ట్ నిర్వహణకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు..

బైట్
1. శివశంకర్ రెడ్డి.. ఇన్ స్పెక్టర్
2. మ్రుతుని బందువు..

SHARE