కావలిలో కొట్టుకోబోయిన కౌన్సిలర్లు

174

The bullet news ( Kavali) _ నెల్లూరుజిల్లా కావలి మునిసిపాల్టీకి ప్రత్యేకహోదా సెగ తగిలింది.. హోదా ఇవ్వాలంటూ జరిగిన చర్చ వివాదానికి దారితీసింది.. అధికార తెలుగుదేశం, మిత్రపక్ష బిజేపీ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. పరస్పరం చొక్కాలు పట్టుకునే వరకు వెళ్లింది.. దీంతో సమావేశం రసాబసగా మారింది.. కావలి మునిసిపల్ పాలక వర్గం ఇవాళ సమావేశమైంది.. బడ్జెట్ తో పాటు ప్రధానమైన పద్దులపై చైర్మన్ అలేఖ్య చర్చ ప్రారంభించారు.  ఇదే సమయంలో టీడీపీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలతో కేంద్రం తీరుపై నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మొదట కౌన్సిల్ లో తీర్మానం చేసి చర్చకు వెళ్దామంటూ ప్రతిపాదించారు. దీనిపై చర్చ మొదలు కాగానే టీడీపీ సభ్యులు కౌన్సిలర్లు కేంద్రం తీరును తప్పుబట్టారు. అందుకు బిజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  కౌన్సిల్ సమావేశం రసాబాసై చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది..  తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలు చేసుకున్నారు..

SHARE