టార్గెట్ ఫిక్స్ చెయ్యండి.. రీచ్ అవ్వండి.. – ఎస్ ఐ శ్రీనివాసుల రెడ్డి..

109

The bullet news ( Manubolu)_ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని మనుబోలు ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. స్థానిక శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ లో నిర్వహించిన క్విజ్ పోటీల్లోని విజేతలకు శ్రీ బాలాజీ జూనియర్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావుతో కలిసి బహుమతులు అందజేశారు.. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చిన్నతనం నుంచి కష్టపడి చదివి తల్లిదండ్రులను బాగా చూడాలన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని, వారి శ్రమని గుర్తించి వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండేవాడే మనిషన్నారు.. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివాలన్నారు. విద్యార్థులోని ప్రతిభను వెలికితీసేందుకు శ్రీవిద్యానికేతన్ క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు..
అనంతరం వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవలన్నారు. అనంతరం మండల స్థాయిలో మొదటి ప్రైజ్ సాధించిన ఇందుప్రియ టీమ్ కి, మంచి మార్క్స్ సాధించిన శిరీష, రోహిత్, పావని, ఇందుప్రియ, అచ్యుత్ హిమాధర్, తేజ, అక్షయ, రాజేష్ లకు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వైష్ణవి, శ్రీపతి శ్రీనువాసులకు బహుమతులు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాలేజి అకడమిక్ ఇంచార్జ్ భాస్కర్ రెడ్డి, విద్యానికేతన్ కరస్పాండెంట్ జగదీష్ బాబు, కానిస్టేబుల్ రాజేష్ పాల్గొన్నారు..

SHARE