THE BULLET NEWS (KOVUR)- ఒకటి కాదు.. రెండు కాదు.. టన్నుల కొద్ది చేపలు రోడ్డు పాలయ్యాయి..లక్షల విలువ చేసే మత్య్ససంపద నేలపాలైంది.. ఈ ఘటన  నెల్లూరు జిల్లా కోవూరు రామ‌న్న‌పాలెం గేట్ స‌మీపంలో  చోటు చేసుకుంది.. చేప‌ల రవాణా చేసే వ్యాన్ బోల్తా కొట్టింది..  ఈ ప్రమాదంలో  దాదాపు 2 ట‌న్నుల చేప‌లు రోడ్డుపాల‌య్యాయి.. మచిలీపట్నం నుంచి తిరుచి వెళ్తున్న వ్యాన్ రామ‌న్న‌పాలెం గేట్ వ‌ద్ద‌కు రాగానే హ‌ఠాత్తుగా టైర్ ప‌గిలిపోయింది.. దీంతొ ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొ్ట్ట‌డంతో చేప‌లు రోడ్డుపాల‌య్యాయి.. ఎలాంటి ప్రాణ‌ప్రాయం లేదు. ఈ ప్రమాదంతో హైవే పై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు నియంత్రించారు.. సమాచారం అందుకున్న కోవూరు, హై వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..

SHARE