విదేశీ సిగరెట్ల సీజ్‌

98

THE BULLET NEWS (HYDERABAD)- అరబ్‌, తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న విదేశీ సిగరెట్లను నగరానికి చెందిన డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో డీఆర్‌ఐ పోలీసులు శాంషాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిఘా వేశారు.  ఓ కంటైనర్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. కంటైనర్‌లో ఉన్న బాక్సులన్నింటిలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్‌ను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏయే దేశాల నుంచి సిగరెట్లను దిగుమతి చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువ రూ. 6.33 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తనిఖీల సమయంలో దొరికిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బాక్సుల్లో సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు.

SHARE