ఇద్దరు మంత్రులను ఇరుకున పెట్టిన ఆదాల కామెంట్స్..

121

The Bullet News ( Nellore)_ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మినిమహానాడు లో చేసిన వ్యాఖ్యలు ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలను ఇరుకున పెట్టేసాయి. వైసిపి ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో స్పీకర్ వాటిని ఆమోదించే అవకాశాలు ఉన్నాయన్నారు.. ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే జిల్లాలో నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు జరగతాయని.. ఎన్నికల బరిలో మంత్రులను దించాలని ఆయన వ్యాఖ్యానించారు.. గతంలో మాదిరి ఉపఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు మంత్రులను ఎన్నికల బరిలోకి దింపారని ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలన్నారు. రెండు పార్లమెంటు స్థానాలకు మంత్రులను రంగంలోకి దింపాలని కోరుకొంటున్నాట్లు ఆయన అన్నారు.. మరోపక్క
పార్టీ మారుతానంటు తన పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని వీడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు..

SHARE