నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన డిమాండ్…

20

THE BULLET NEWS – ఏపీకి ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ప్రకారం రావలసిన నిధులు, ఎక్సైజ్ సుంకం రానప్పుడు స్పెషల్ స్టేటస్‌తో ఉపయోగమేంటని మాత్రమే తాను అన్నానని చెప్పారు. నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన డిమాండ్ అని ట్వీట్ చేశారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా? ప్యాకేజీనా? అన్నది పెద్ద విషయం కాదని పవన్ వ్యాఖ్యానించినట్టుగా ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగడంతో… నిన్ననే జనసేన పార్టీ స్పందించింది. తాజాగా ఇవాళ పవన్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.

SHARE