గాలిముద్దుకృష్ణమ పార్థివ దేహానికి ఘన నివాళి

116

THE BULLET NEWS (RAMACHANDRA PURAM)- మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు, టీడీపీ సీని యర్‌ నాయకుడు గాలిముద్దుకృష్ణమ నాయుడుకు పలువురు నాయకులు, అధికారులు ఘననివాళులు అర్పించారు

ముద్దుకృష్ణమనాయుడు మూడురోజల కిందట తీవ్రమైన డెంగీ జ్వరంతో ఆసుపత్రిలో చేరారని, ఆయనను వెంటిలేటర్‌, రీనల్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వంటి చికిత్సలతో రక్షించేందుకు శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఐదురోజుల కిందట ఆయన జ్వరంతో అనారోగ్యానికి గురయ్యారన్నారు. జ్వరంతో పాటు పలు అవయవాలు పనిచేయకపోవడం(మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌)తో ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.50గంటలకు తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డా.భవానిప్రసాద్‌ ప్రకటించారు.

రామచంద్రాపురం మండలంలోని ఆయన స్వగ్రామం వెంకట్రామాపురానికి బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్రం నలు మూలల నుంచి ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెంకట్రామాపురానికి తరలివచ్చారు.

చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ముద్దుకృష్ణమనాయుడు గుర్తింపు పొందారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజ‌కీయాల్లో  ముద్దు కృష్ణ‌మనాయుడుది చెర‌గ‌ని ముద్ర వేశారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు గారి కుటుంబ స‌భ్యుల‌కు తన ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్.

తమ గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపును తీసుకురావడమే కాకుండా, జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ముద్దుకృష్ణమనాయుడు మరణవార్తను వెంకట్రామాపురం వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఊరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.

SHARE