ఎమ్మార్వో మాధురి తీరుకు నిరసనగా ధర్నా

101

THE BULLET NEWS (GANAVARAM)-గన్నవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ముస్తాబాద్ గ్రామస్తులు తమ సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు. ముస్తాబాద్ లో ఎస్.సి ఏరియాలో ఉన్న చర్చి నుండి కొండ పై ఉన్న శిలువ వద్దకు వెళ్ళే దారి మరమ్ముతులు చెయ్యాల్సి ఉంది.ఆ మరమ్మతులు చేపట్టాలని అక్కడివారు సిద్ధమవుతుంటే గన్నవరం ఎమ్మార్వో ములుగు మాధురి అడ్డుకున్నారు.శిలువ వద్దకు వెళ్ళే దారి మరమ్మతులు గుర్తెయ్యాయా?… అంటూ ఎమ్మార్వో అడ్డుపడ్డారు.దీనితో ఎమ్మార్వో తీరుకు నిరసనగా ఆమె కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు.ఐతే దళితుల ధర్నాకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావు,సీపీఎం నేతలు.మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ భక్తులు గుడికి వెళ్లి దండం పెట్టుకోవడానికి వెళ్ళే రాహాదారిని బాగుచేసుకోవడానికి ఏ నిబంధనలు అడ్డువస్తాయని విమర్శించార్రు.భాదితులకు మా పార్టీ అండగా ఉంటుందన్నారు..

SHARE