నెల్లూరు లో గుప్పుమంటున్న గంజాయి…

246

THE BULLET NEWS (NELLORE) -దాన్ని దమ్ము పీల్చితే చాలు.. ఆకాశంలో ఉన్న చుక్కలు కళ్ళ ముందు కనిపిస్తాయి.. అదే.. సిగ‌రెట్ల‌లో పెట్టుకుని తాగితే దానికొచ్చే కిక్కే వేరు.. స్మార్ట్ లుక్ తో కిక్కును తెగ ఎంజాయి చేస్తున్నారు నెల్లూరు యూత్. ఇంతకీ ఏంటా కిక్కు..? దీనిపై అధికారులు ఏమంటున్నారు..?

నెల్లూరుజిల్లాలో గంజాయి గుప్పుమంటోంది.. చాపకింద నీరులా ఈ గంజాయి విస్తరిస్తోంది.. కాలేజీ యువతే లక్ష్యంగా గంజాయి వ్యాపారులు చెలరేగిపోతున్నారు.. లారీలు, వ్యాన్ల‌తో పాటు రైళ్ల‌లోనూ జోరుగా అక్రమ రవాణా సాగుతున్నట్లుత తెలుస్తోంది. గూడూరు మార్గం గుండా నుంచి నిత్యం ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నెల్లూరుకొచ్చిన సరుకును ఇక్కడి సభ్యులు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు టాక్..

నెల్లూరు కేంద్రంగానే గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్, కపాడిపాలెం, ఇరుకళల పరమేశ్వరీ దేవాలయం సమీప ప్రాంతాలు, వెంకటేశ్వర పురం వంటి ప్రాంతాల్లో గంజాయిని జోరుగా అమ్ముతున్నారు.. ఈ గంజాయిని కాలేజీ స్టూడెంట్స్ కు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.. విద్యార్దులు వీటికి బానిసలవుతున్నారు. నైజిరియా, సూడాన్ వంటి దేశస్తులు అనేకమంది చదువు, వ్యాపారాలు నిమిత్తం జిల్లాలో నివసిస్తున్నారు. వీరు కేంద్రగానే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.. గంజాయి అక్రమ రవాణాను, విక్రయాలను అరికట్టడంలో ఎక్సైజ్ శాఖాధికారులు ఘోరంగా విఫలమయ్యారని వస్తున్న వార్తల నేపథ్యంలో బుల్లెట్ న్యూస్ సంప్రదించగా గంజాయిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాదిలో దాదాపు 8 గంజాయి కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ డీసీ శ్రీనివాసరావు తెలిపారు.. మాదక ద్రవ్యాలకు యువత బానిసలవుతున్న నేపథ్యంలో త్వరలోనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాలేజీల్లోనే ప్రోగ్రామ్స్ నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తామన్నారు. కపాడిపాలెం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.. పాత సప్లయర్స్ పై కూడా నిఘా పెడుతున్నామన్నారు.

SHARE