జగన్‌పై గంటా సెటైర్‌..

66

The bullet news (POLITICAL)- రాజకీయాల్లో విలువలు గురించి వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడడం ‘జోక్‌ ఆఫ్‌ ద డికేడ్‌’ అని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఆయన విజయనగరంలో మాట్లాడుతూ జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో కేసుల గురించే 14 పేజీలు పెట్టారని.. దేశంలో ఏ నేతపైనా ఇన్ని కేసులుండవని అన్నారు. రాజకీయాల్లో నికార్సైన వ్యక్తి చంద్రబాబు అని అన్న గంటా.. బాబు గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుందని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం ఇస్తామన్న మంత్రులను రావొద్దని చెప్పి జగన్‌ సైకోలా ప్రవర్తించారని గంటా అన్నారు. జగన్ 3 వేల కిలోమీటర్లు కాదు.. 30 వేల కిలోమీటర్లు నడిచినా ఉపయోగం ఉండదన్న గంటా.. విశాఖలో జరిగిన పాదయాత్రలో జగన్ రైల్వే జోన్ కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదని గుర్తుచేశారు. వైసీపీ మునుగుతున్న పడవ అని.. 2019లో ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు.

SHARE