షార్ట్ ఫిల్మ్, సినిమా అవకాశాల పేరుతో అమాయకులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన నెల్లూరు టౌన్ పోలీసులు …

286

✍ షేక్ అస్లాం✍ నెల్లూరు నగరంలో షార్ట్‌ఫిల్మ్‌ సినిమా అవకాశాల పేరుతో అమాయక యూవతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలో షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని శారీరకంగా లోబర్చుకుని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి 8మంది నిర్వాహకులను 5మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనుండి ఒక ఐ20 కార్‌, 1.మోటర్‌ సైకిల్‌, కంప్యూటర్‌. 14 సెల్‌ ఫోన్స్‌. రూ.12,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. జాకీర్‌ హుస్సేన్‌ను, విటులను పట్టుకున్న పోలీసులను నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి అభినందించారు.