The bullet news (Venkata giri)- దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్య్ర సమయంలో ప్రాణాలర్పించిన మహనీయులను అందరూ స్మరించుకోవాలని వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ అన్నారు.. స్థానిక మున్సిపాలిటీ ఆఫీసు మ‌రియు కాసిపేట స్కూల్, ధర్మపురం స్కూల్లో ఆమె జెండా వంద‌నం చేశారు.. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి స్వేచ్చ క‌ల్పించిన మ‌హానీయులను ప్రతి ఒక్క‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. కష్టాల్లో ఉన్న‌వారికి సాయం చేసే మ‌హోన్న‌త ల‌క్ష‌నం స్వాతంత్ర్య వీరుల నుంచి మ‌నం నేర్చుకోవ‌చ్చ‌న్నారు.. ధర్మపురం స్కూల్ లో కేక్ క‌ట్ చేసి విద్యార్దినీ విద్యార్దుల‌కు చాక్లెట్లు పంచి పెట్టారు..

SHARE