ఆత్మ‌కూరులో విద్యార్ది ప్రాణం తీసిన గ్రావెల్ గుంత‌

137

The bullet news (Atmakuru)_గాలికొదిలేసిన బోరు బావులు ఉమ్మడి తెలుగు రాష్టాల్లో అనేక మంది చిన్నారులను మింగేశాయి.. ఇది రైతుల తప్పిదంగా అధికారులు చేతులు దులుపుకున్నారు.. ఆపై ఇలా జరగకూడదంటూ కొన్ని చర్యలూ చేపట్టారు. అదే అధికారులు చేసిన తప్పిదంతో ఓ చిన్నారి బలిగొంటే..? ఎవరిని ప్రశ్నించాలి..? కన్నవారి కడుపుకోతను ఎవ్వరు తీర్చాలి..? అందులోనూ అధికారి కార్యాలయ స‌మీపంలోనే పసిబిడ్డ బలైతే దానికి బాధ్యులెవ్వరు..? నెల్లూరుజిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఈ దుర్ఘటన జరిగింది..

ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతున్న ఓ చిన్నారి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయ స‌మీపంలోని గ్రావెల్ కోసం తీసిన గుంత‌లో పడి మృత్యువాతపడ్డాడు.. సమీపంలోని పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఇస్మాయిల్ అనే విద్యార్డి ఈ గుంతకు బలయ్యాడు..

ఆర్డీవో కార్యాలయ స‌మీపంలో గ్రావెల్ కోసం తీసిన గుంత‌ను పూడ్చి ఉన్నా.. ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాద‌ని అటు త‌ల్లిదండ్రులు, స్థానికులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.. అల్లారుముద్దుగా పెంచిన ఓ బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసేయే కావు. చెప్పేందుకే నీతులన్నట్లు నానుడికి ప్రత్యక్ష తార్కాణంగా ఉన్న ఈ ఘటనపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. .లేకట్లయితే మరెంత మంది ఇలా నిండు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందో అధికారులు బీ అలర్ట్..

SHARE