అస్త‌మించిన ద్ర‌విడ సూరీడు…

106

THE BULLET NEWS (CHENNAI)-సినిమాల్లో నాయకుడి గొప్ప తనం తెలియాలంటే.. ప్రతినాయకుడు కూడా ధీటుగా ఉండాలి. దశాబ్దాల తరబడి తమిళనాడుని ఏలిన కరుణానిధి, జయలలిత విషయంలో ఈ నానుడి నిజమైంది. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. వీరిద్దరూ అసెంబ్లీలో ఉన్నారంటే మాటల తూటాలు ఖాయమనే అభిప్రాయం ఉండేది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కౌంటర్లు, సెటైర్లు, సవాళ్లు.. ఇలా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేవారు. ఇదే విషయాన్ని ఇప్పుడు తమిళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వీరిద్దరినీ అసెంబ్లీలో ఇక చూడలేమని, ఈ లోటు ఎప్పటికీ తీరేది కాదని చెబుతున్నారు. గతంలో వీరిద్దరూ అసెంబ్లీలో ఉన్న ఫొటోను నెటిజన్లు షేర్‌ చేస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నరు.

SHARE