గూడూరు ఎబివిపి ఆధ్వర్యంలో ఈ నెల 17, 18న సైన్స్ ఫెయిర్…

102

The Bullet News ( Gudur ) – గూడూరు డివిజన్ ఎబివిపి ఆధ్వర్యంలో ఈ నెల 17,18 తేదీల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్) నిర్వహిస్తున్నట్లు డివిజన్ కార్యదర్శి మనోజ్ తెలిపారు. స్థానిక కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు…గూడూరు డివిజన్ పరిధిలో ఉండే వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.. గూడూరు లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్ రెండు రోజుల పాటు ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు మనోజ్ తెలిపారు.. ప్రతి పాఠశాల నుంచి రెండు ప్రయోగాలకు అవకాశం ఉంటుందన్నారు.. ఇప్పటి వరకు దాదాపు 60 ప్రయోగాల నిర్వహణకు విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు.. రెండు రోజుల పాటు జరగబోతున్న ఈ సైన్స్ ఫెయిర్ విజయవంతానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని మనోజ్ కోరారు.. మరింత సమాచారం కోసం 9505908258, 9440693741 నంబర్స్ లో సంప్రదిచాలని కోరారు.. ఈ సమావేశంలో నగర కార్యదర్శి చిన్న, సహాయ కార్యదర్శి రవి పాల్గొన్నారు…

SHARE