గూడూరులో బ‌లం పుంజుకుంటున్న టీడీపీ

88

The bullet news (Gudur)_  గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బ‌లం పుంజుకుంటోంది.. ఎమ్మెల్యే పాశం సునీల్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మండ‌ల స్థాయి నాయ‌కులు టీడీపీ తీర్డం పుచ్చుకుంటున్నారు.. తాజాగా ఇవాళ గూడూరు పాతబస్టాండు సెంటరులోని దాదాపు 20 మంది ఆటో యూనియన్ కార్మికులు వీరిబోయిన గోపాలకృష్ణ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సునీల్ స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సునీల్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.. ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బలీయ‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తోంద‌న్నారు.. 2019లో కూడా రాష్టంలో టీడీపీ అధికారంలోకి రానున్న‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.. త‌న‌ను ఆద‌రిస్తూ, త‌న మీద న‌మ్మ‌కం పెట్టిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటాన‌ని సునీల్ అన్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.. అనంత‌రం యూనియ‌న్ నాయ‌కులు ఎమ్మెల్యేను ఘ‌నంగా స‌న్మానించారు..

SHARE