THE BULLET NEWS (AMARAVATHI)-గూడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సునీల్ కృషి చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేపించుకోవటం లో ఆయన కనబరుస్తున్న శ్రద్ద మంత్రుల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది.. నియోజకవర్గపరిధిలో పేరుకుపోయిన పలు సమస్యలను ఆయా మంత్రుల దృష్టి కి తీసుకెళ్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు.. తాజాగా
వాకాడు మండలంలోని తూపిలిపాళెం బీచ్, వాడపాళెం లైట్-హౌస్ బీచ్ లలో రిసార్ట్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియను ఆయన కలిశారు.. ఏపీ సచివాలయంలో మంత్రితో ప్రత్యేకంగా సమావేశమైన సునీల్ బీచ్లలో రిసార్ట్ లా ఆవశ్యకత వివరించారు..పర్యాటక రంగంలో జిల్లా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రిసార్ట్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.. స్పందించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.. అనంతరం గూడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం గురించి చర్చించారు.. ఈ సందర్బంగా ఇంటింటికి టిడిపి లో ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన మంత్రి వివరించారు.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానాని మంత్రి తెలిపారు..

SHARE