రోడ్డెక్కిన విఆర్ఏలు..

164

THE BULLET NEWS (GUDUR)-నెల్లూరుజిల్లా వ్యాప్తంగా విఆర్ ఏలు రోడ్డెక్కారు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోలన బాట పట్టారు.. తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని, 010 పద్దుల ద్వారా వేతన చెల్లింపులు చేయాలని వారు డిమాండ్ చేశారు.. దాంతో పాటు బయోమెట్రిక్ నుండి మినహాయింపు ఇస్తూ.. నామినీలను విఆర్ఏ లుగా నియమించాలని డిమాండ్ చేశారు.. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే రాష్ట వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.

SHARE