గూడూరును ఆద‌ర్శ‌వంత నియోజ‌క‌వ‌ర్గంగా అభివృద్ది చేస్తా – ఎమ్మెల్యే సునీల్

44

The bullet news (Gudur)- ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఆశీస్సుల‌తొ నియోజ‌క‌వ‌ర్గాన్ని అద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన‌ని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. చిల్ల‌కూరు మండ‌లంలోని తిప్ప‌గుంట‌పాలెంలో రూ. కోటి 25లక్ష‌ల‌తో 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి పూజా ఆయ‌న శంకుస్థాప‌న చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు అభివృద్దితోనే స‌మాధానం చెబుతాన‌న్నారు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే 50 కోట్ల రూపాయాల‌తో అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు.. టీడీపీ హ‌యాంలోనే గూడూరు అన్ని విధాల అభివృద్ది చెందుతుంద‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

SHARE