హత్య కేసు దోషులకు ఉరిశిక్షతో పాటు జీవితఖైదు విధించిన గురజాల కోర్టు…

78

THE BULLET NEWS (GUNTUR)- గురజాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసు దోషులకు ఉరిశిక్షతో పాటు జీవితఖైదు విధించింది. అంతేకాదు రూ.10 వేలు జరినామా విధించింది. 2011లో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో దోషులుగా సుబానీ, పెదజాన్, బుజ్జి, అహ్మద్‌ ఉన్నారు. ఆస్తి కేసు వివాదంలో 2011 నవంబర్ 4న షేక్ సైదా అనే వ్యక్తిని సుబానీ, పెదజాన్, బుజ్జి, అహ్మద్‌ హత్య చేశారు. ఏడేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు ఐపీసీ 302 ప్రకారం వీరికి ఉరిశిక్షతో పాటు ఐపీసీ 120/34 ప్రకారం జీవిత ఖైదు విధించింది. అయితే హత్యకు గురైన వ్యక్తి.. శిక్ష పడిన వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి చెందినవారిగా సమాచారం.

SHARE