తడలో గుట్కా గ్యాంగ్ అరెస్ట్.. రూ. 5.50 లక్షల విలువైన గుట్కా పాకెట్స్ స్వాధీనం

124

THE BULLET NEWS (TADA)-నిషేధిత గుట్కా,మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న చెన్నైకి చెందిన ముగ్గురిని తడ పోలీసుల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.. కేసుకు సంబంధించిన వివరాలను గుడూరు డీఎస్పీ రాంబాబు మీడియాకు వివరించారు.. చెన్నైలోని గుమ్మడిపూడికి చెందిన మోహన్, కబాలి, భాస్కర్ లు ఈజీ మనీ సంపాదించాలనే కోరికతో నిషేధిత గుట్కాలను బెంగుళూరు నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి తడ సరిహద్దు ప్రాంతాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. పక్క సమాచారంతో నిఘా ఉంచిన సూళ్లూరుపేట సిఐ విజయకృష్ణ, తడ సిఐ కిషోర్ ఏస్ ఐ వెంకటేశ్వర రావు వారిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువ చేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు..

SHARE